
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుడూరు గ్రామంలో మంగళవారం పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండ టాస్క్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా జరిపిన రైడ్ లో గుడూరు గ్రామ శివారు పౌల్ట్రీ ఫారంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. పేకాట స్థావరం నుండి 5 సెల్ ఫోన్లు, 22,500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు.
…………………………………..