
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో బుధవారం ఉదయం 10 గంటలకు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు కేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంట ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య ఉన్నారు.
……………………………………………………………..