
* 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు
ఆకేరు న్యూస్ డెస్క్ : 2020 లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించడంతో బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టులో వేశాడు. సీఏఏకు వ్యతిరేకంగా 2020లో ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో దాదాపు 700 మంది గాయపడగా 53 మంది చనిపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనల్లో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ నేపధ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయాంచాడు.బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైన వారిలో ఖలీద్, షర్జీల్తోపాటు మహ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహ్మాన్, అథర్ ఖాన్, మీరన్ హైదర్, అబ్దుల్ ఖాలిద్ సైఫీ, గుల్ఫిషా ఫాతిమా, షాదాబ్ అహ్మద్ ఉన్నారు. వారిలో షర్జీల్ ఇమామ్, ఫాతిమా గత వారమే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు ఉమర్ ఖలీద్ సుప్రీంకు వెళ్లాడు.
………………………………………