
* గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
* ఇండిపెండెంట్ గా ఒకే చోట పోటీ చేద్దాం అని కిషన్ రెడ్డికి సవాల్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న రాష్ట్ర కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని రాజాపసింగ్ అన్నారు.. ప్రస్తుత అధ్యక్షుడు రాంచందర్ రావు కీలు బొమ్మ లాంటి వాడని రాజాసీంగ్ అన్నారు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డికి ఓ సవాలు విసిరారు. ఎంపీగా కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని ఇద్దరం కలిసి ఒకే చోటు నుంచి పోటీచేద్దాం అంటూ సవాల్ విసిరారు. బీజేపీ అధిష్టానాన్ని బతిమిలాడే అవసరం లేదని రాజాసింగ్ అన్నారు. నా అవసరం ఉందని భావిస్తే వారంతట వారు పిలిస్తే వెళ్తాను కాని నేను ఎట్టి పరిస్థితిలో తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
………………………………………….