
* పశుపతినాథ్ ఆలయం వద్ద పటిష్ట భద్రత
* సరిహద్దుల్లోభారత్ హై అలర్ట్
* ఢిల్లీలో తెలంగాణ సహాయక కేంద్రం
ఆకేరు న్యూస్, డెస్క్ : నేపాల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్మీ (Army) తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. ఖాట్మాండు సహా పలు నగరాల్లోకర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఖాట్మాండులో లలిత్పూర్ సహా అనేక ప్రాంతాల్లో ఆర్మీ ఆంక్షలు విధించింది. జెన్ – జెడ్ (Gen-Z) ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సమూహాలు ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై నేపాల్ సైన్యం (Nepal Army) ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీలు, విధ్వంసాలను నివారించడానికి ఎక్కడికక్కడ దళాలను మోహరించినట్లు పేర్కొంది. మళ్లీ ఘర్ఫణలు జరగకుండా చర్యలు చేపట్టింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సైన్యం కీలక ప్రదేశాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. పశుపతినాథ్ ఆలయాన్ని (Pasupathinath Temple) కాపాడటానికి సైన్యం జోక్యం చేసుకుంది. సైన్యం శాంతియుత పరిష్కారానికి పిలుపునిచ్చింది. నిరసనకారులు విమానాశ్రయంపైకి చొరబడి సింఘా దర్బార్ ప్రభుత్వ సచివాలయం లోపల నిప్పంటించడానికి ప్రయత్నించిన తర్వాత, కీలకమైన మౌలిక సదుపాయాలను భద్రపరచడానికి నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా పవిత్ర పశుపతినాథ్ ఆలయ ద్వారం ధ్వంసం చేయకుండా చర్యలు చేపట్టింది. నేపాలీ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్, జనరల్ జెడ్ నిరసనకారులు చర్చల ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. కాగా నేపాల్ రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లోభారత్ హై అలర్ట్ (High Allert) ప్రకటించింది. బలగాలను మోహరించింది. అలాగే నేపాల్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఢిల్లీలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణవాసులు నేపాల్ లో చిక్కుకున్నట్లు ఆధారాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది.
……………………………………….