
* కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: బీఆర్ ఎస్ పార్టీ జైత్ర యాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెడదాం అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్ని జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మాగంటి సునీతను గెలిపించాలని ఆమెను గెలిపిస్తేనే మాగంటి గోపీనాధ్ కు సరైన నివాళి అని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుందని అన్నారు. కొన్ని డివిజన్లలో కాస్త వెనుకబడి ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగవద్దని సూచించారు. ఎక్కడైనా దొంగోట్లు ఉంటే వాటిని తొలగించాలని కోరారు.అందరం కలిసికట్టుగా పనిచేసి గోపీనాథ్ ఆశయాలను నిజం చేద్దాం అని కోరారు.
…………………………………………