
encounter Police Force - File
* సెంట్రల్ కమిటీ సభ్యుడు మోడం బాలకృష్ణ మృతి..?
* మోడం బాలకృష్ణ మడికొండ కు చెందిన వాడే ,
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి : మరోసారి చత్తీష్ గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కేంద్ర కమిటీ సభ్యుడు మోడం బాలకృష్ణ సహా పది మంది మావోయిస్ట్‌లు మృతి చెందినట్టు సమాచారం. గరియాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా భద్రతా బలగాలు భావిస్తున్న మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ కూడా ఈ ఎన్ కౌంటర్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మోడం బాలకృష్ణ హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన వారు. కాగా కుటుంబం హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. ఎన్ కౌంటర్‌కు సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
——————————-