* వినూత్న రీతిలో నిరుద్యోగుల నిరసన
ఆకేరు న్యూస్, హనుమకొండ : మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 ను నిరుద్యోగ దినంగా జరుపుకోవాలని నిరుద్యోగ యువత నిర్ణయం తీసుకుంది. 2014లో అధికారంలోకి రాక ముందు ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి కావస్తున్నా మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని నిరుద్యోగ యువత ఆరోపిస్తోంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని యువత ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈ నేపధ్యంలో మోదీ జన్మదినం సెప్టెంబర్ 17ను నిరుద్యోగ దినంగా జరుపుకోవాలని నిరుద్యోగ యువకులు నిర్ణయించుకున్నారు. ఈ విధంగా మోదీకి తమ నిరసన తెలియజేయనున్నారు.
………………………………………
