* 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
* షెడ్యూల్ ఖరారు చేసిన తమిళగ వెట్రి కళగం
* ఆసక్తిగా మారనున్న తమిళ రాజకీయాలు
ఆకేరు న్యూస్ డెస్క : అసెంబ్లీ ఎన్నికలకు తమిళ నాడు పార్టీలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సన్నధ్దమవుతున్నాయి.తమిళనాడు రాజకీయాల్లో సినీతారల ప్రభావం ఎక్కువ అక్కడి రాజకీయాలను సినీ నేపధ్యం నుంచి వచ్చిన వారే శాసిస్తున్నారు. అన్నాదురై (ANNA DURAI) మొదలు కొని స్టాలిన్ (STALIN) వరకు సినీ నేపధ్యం ఉన్న వాళ్లే తమిళ నాడు రాజకీయాలను శాసిస్తున్నారు. అన్నాదురై,కరుణానిధి,(KARUNANIDHI) ఎంజీ రాంచంద్రన్(MG RAMCHANDRAN) , జయలలిత(JAYALALITHA) ,ఉదయనిధి స్టాలిన్(UDAYANIDHI STALIN), కమల్ హాసన్ (KAMAL KASAN,ఖుష్బూ (KHUSHBU)అందరూ సినిమా రంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వారే.. తాజాగా తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ విజయ్ ఎంటర్ అయ్యాడు.. తనదైన స్టైల్ లో తమిళనాడు సినిమారంగంలో ఓ ప్రత్యేకస్థానం పొందడమే కాదు అత్యధిక అభిమానులు సంపాదించుకున్నాడు.. విజయ్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది..సినిమా రంగంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్ సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు,,తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించాడు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటనలు చేశాడు. తాజా రాష్ట్రవ్యాపంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను కవర్ చేసేందుకు ప్రోగ్రాం సిద్ధం అయింది, ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. 13న తన మొదటి విడత పర్యటనకు తిరుచ్చి సమీపంలోని శ్రీరంగం నుంచి విజయ్ శ్రీకారం చుట్టనున్నారు. 13న తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు నియోజకవర్గాలు, 20న నాగపట్టినం, తిరువారూరు, మైలాడుదురై, అక్టోబర్ 4, 5న కోవై, నీలగిరి(Neelagiri), తిరుప్పూరు, ఈరోడ్, అక్టోబర్ 11న కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, 12న కాంచీపురం, వేలూరు, రాణిపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.అక్టోబర్ 25న సౌత్ చెన్నై, చెంగల్పట్టు, నవంబర్ 1న కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, 8న తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, 15న తెన్కాశి, విరుదునగర్, 22న కడలూరు(Kadaluru), 29న శివగంగ, రామనాధపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. డిసెంబర్ 6న తంజావూరు, పుదుకోట, 13న సేలం, నామక్కల్, కరూరు, 20న దిండుగల్, తేని, మదురై నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. విజయ్ తొలివిడత ప్రచార పర్యటనకు వారాంతపు సెలవుదినాలైన శని, ఆదివారాలను మాత్రమే ఎంపిక చేసుకోవటం విశేషం.
…………………………………………
