* రహదారిపై ఉన్న కల్వర్టుపై దర్జాగా కూర్చున్న పులి
ఆకేరున్యూస్,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పులి సంచరిస్తోంది. పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం ఉదయం సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఉన్న కల్వర్టుపై దర్జాగా కూర్చొని ఉంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయంతో పరుగులుతీయగా కొంత మంది ప్రయాణికులు దూరం నుంచి పులిని తమ సెల్ ఫోన్లో బంధించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు.
………………………….
