ఆకేరు న్యూస్, డెస్క్ : భారతదేశ 15వ ఉపరాష్ట్రపతి (Vice President)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhawan)లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రదాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఎన్డీయే కూటమికి చెందిన నేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా హాజరయ్యారు. ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి (Vice-President) ఎన్నికల్లో రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు.
………………………………………
