* భారీ వర్షాలే కారణం : టీపీసీసీ
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కామారెడ్డిలో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావించిన బీసీ డిక్లరేషన్ సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు టీపీసీసీ ప్రకటించింది. అయితే ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇంకా తెలియజేయలేదు. త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని పీసీసీ పేర్కొంది. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు భావించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కూడా ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైన సభగా ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు అనూహ్యంగా వాయిదా పడడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది పార్టీ ప్రకటించకపోడంతో గందరగోళంలో పడ్డారు.
……………………………………..
