ఆకేరున్యూస్ డెస్క్ : చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో పది మంది మావోస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలను గరియాబంద్ పోలీసులు విడుదల చేశారు. పది మందిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ వరంగల్ జిల్లా ఇతని పై చత్తీస్ ఘడ్,ఒడిషా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1 కోటి 60 లక్షల రివార్డు ఉంది.ప్రమోద్ అలియాస్ పాండుఅలియాస్ అలవాల చంద్రహాస్ అలియాస్ పండరన్న అలియాస్ చంద్రన్న అలియాస్ వాసు అలియాస్ ప్రేమ్ దాదా ఓడిసా రాష్ట్ర కమిటీ సభ్యుడు మొత్తం 70 లక్షల రివార్డు ఉంది. విమల్ అలియాస్ మంగన్న అలియాస్ సురేష్ జైది , టెక్నికల్ టీం మెంబర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాడు ఇతనిపై మొత్తం 18 లక్షల రివార్డు ఉంది. మంజు అలియాస్ రాణి సుకుమా జిల్లాకు చెందింది ఈమె పై 13 లక్షల రివార్డు ఉంది. ఉమేష్, ఎస్టీకే ఏసీ డిప్యూటీ కమాండర్ నారాయణ పూర్ జిల్లా 13 లక్షల రివార్డు ఉంది..రజిత నారాయన పూర్ జిల్లా 13 లక్షల రివార్డు ఉంది. అంజలి , టెక్నికల్ టీం సభ్యురాలు 13 లక్షల రివార్డు ఉంది. సింధు టెక్నికల్ టీం సభ్యురాలు 13 లక్షల రివార్డు ఉంది. ఆరతి టెక్నికల్ టీం సభ్యురాలు 3 లక్షల రివార్డు ఉంది. సమీర్ ఇతనిపై మూడు రాష్ట్రాల్లో కలిపి 3 లక్షల రివార్డు ఉంది.
…………………………………………….
