*గర్మళ్ల వద్ద మానేరులో చిక్కుకున్న ఏడుగురు కూలీలు
ఆకేరు న్యూస్, భూపాలపల్లి : భూపాల పల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మళ్లపల్లి వద్ద మానేరులో ఒకే సారి వరదలు రావడంతో వాగులో ఇసుకను నింపడానికి వెళ్లిన దాదాపు 30 మంది కూలీలు 9 ట్రాక్టర్లలలో వెళ్లారు. పైనుండి ఒకే సారి వరదలు రావడంతో కొంత మంది కూలీలు ట్రాక్టర్లను వదిలి పారిపోయి ప్రాణాలు రక్షించుకోగా ఏడుగురు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి గ్రామస్తుల సహాయంతో కూలీలను రక్షించారు. తాడు సహాయంతో కూలీలను వరద ఉధృతి నుండి బయటకు తీసుకువచ్చారు
శభాష్ పోలీస్..
ఏడుగురు కూలీలను ప్రాణాలతో కాపాడినందుకు స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.
వేగంగా స్పందించి కూలీలను కాపాడిన డీఎస్పీ సంపత్ రావు,చిట్యాల సీఐ మల్లేశ్,ఎస్సై సుధాకర్,ఎస్సై శ్రవణ్ సిబ్బంది రమేష్, సందీప్ లను రెస్క్యూ ఆపరేషన్ జిల్లా SP కిరణ్ ఖరే అభినందించారు.
……………………………………
