* మిజోరంలో మోదీ విమర్శలు
* రూ. రూ.9వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఓటు బ్యాంకు రాజకీయాలకే కాంగ్రెస్ పరిమితమైందని, కొందరి రాజకీయాల వల్లే అభివృద్ధిలో వెనుకబడ్డామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER MODI) విమర్శించారు. మిజోరంలోని ఐజ్వాల్ లో మోదీ ఈరోజు పర్యటించారు. బైరబీ-సైరాంగ్ రైల్వేలైన్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారతీయ రైల్వే నెట్ వర్క్ తో ఐజ్వాల్ (IJWAL)ను అనుసంధానం చేశామన్నారు. రూ.8,070 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గౌహతి, కోల్‌కతాకు మూడు కొత్త రైల్వే లైన్లను కూడా మోదీ ప్రారంభించారు. రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. అన్ని రాష్ట్రాల రాజధానులనూ రైల్ నెట్‌వర్క్‌తో కలపాలన్న లక్ష్యంలో భాగంగా మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు రైల్వే లైన్ వేసే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటిదాకా మిజోరంలోని బైరాబి వరకు మాత్రమే రైల్వే లైను ఉండేది. అసోం (ASSAM) సమీపంలోని ఈ స్టేషన్ వరకు లైన్ ఉన్నప్పటికీ మిజోరం ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అందుకే రాజధాని ఐజ్వాల్‌ను కలిపే లక్ష్యంతో ఈ బైరాబి నుంచి ఐజ్వాల్ పక్కనుండే సాయ్‌రంగ్‌కు లైన్ వేసే యజ్ఞాన్ని తలపెట్టారు. కానీ ఈ మార్గం పొడవునా ఎత్తైన కొండలు, భారీ లోయలే ఉన్నాయి. వాటన్నింటి మధ్య నుంచి ఎత్తుపల్లాల్లేకుండా సమాంతరంగా రైల్వే లైన్ నిర్మించడమంటే ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే. రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చయ్యింది.
………………………………………
