* బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రారంభించిన ప్రధాని
* నిపుణుల సమర్థతకు నిదర్శనం 144 బ్రిడ్జి
* మొత్తం 51 కిమీ..దూరం 55 మేజర్ బ్రిడ్జిలు,89 మైనర్ బ్రిడ్జిలు,48 టన్నెల్స్
* మిజోరం రాజధాని ఐజ్వాల్ కు దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఈశాన్య భారత దేశం( EASTERN INDIA) కొండలు లోయలతో ప్రకృతి రమణీయత సంతరించుకిని ఉంటుంది. ఈశాన్య భారతదేశాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకు ప్రతీ రోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. అద్బుతమైన ప్రకృతి సౌందర్యాలతో కూడిన ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరం (MIZORAM)ఒకటి . ఈ రాష్ట్ర రాజధాని నగరానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ లేదు. అయితే మిజోరం రాష్ట్ర రాజధానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ నిర్మాణాని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. 11 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రైల్వే లైన్ ను ప్రధాని మోదీ (NARENDRA MODI) శనివారం జాతికి అంకితం చేశారు.బైరబీ-సైరాంగ్ (BYRABI SYRANG RAILWAY LINE) రైల్వేలైన్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారతీయ రైల్వే నెట్ వర్క్ తో ఐజ్వాల్ (IJWAL)ను అనుసంధానం చేశామన్నారు. రూ.8,070 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గౌహతి, కోల్కతాకు మూడు కొత్త రైల్వే లైన్లను కూడా మోదీ ప్రారంభించారు. దేశంలో ని ఇతర ప్రాంతాల్లాగా ఈశాన్య రాష్ట్రాలో రవాణాను మెరుగు పరచాలంటే చాలా కష్టం లోయలు కొండలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలంటేనే ఎంతో కష్టం అలాంటిది భారత ఇంజనీర్లు మిజోరం రాష్రంలో కొండలు లోయల మధ్య 51 కిలో మీటర్ల రైల్వే లైనును పూర్తి చేశారు.
భారత ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం
ఈ రైల్వే లైన్ నిర్మాణం భారత దేశ ఇంజినీర్లు,నిపుణుల పనితనానికి వారి సమర్థతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ రైల్వే లైన్ నిర్మాణానకి మొత్తం 8వేల కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం 51 కిమీ దూరం గల ఈ రైల్వే లైనులో మొత్తం నాలుగు స్టేషన్లు ఉన్నాయి . 51 కిమీ దూరంలో 55 మేజర్ బ్రిడ్జిలు,89 మైనర్ బ్రిడ్జిలు,48 టన్నెల్స్ ఉన్నాయి.
144 బ్రిడ్జి ప్రత్యేకమైనది
ఈ లైన్ మొత్తంలో 144 నెంబర్ గల బ్రిడ్జి చాలా ప్రత్యేకమైనది.114 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. అంటే ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ కంటే ఈ బ్రిడ్జి ఎత్తు ఎక్కువ . సింగిల్ పిల్లర్లపై ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. భూకంపాలు భారీ వరదలు వచ్చినా తట్టుకొని నిలబడే విధంగా అత్యంత ఆధునికమైన టెక్నీలజీతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. లోయలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. నీటి వేగానికి తట్టుకొని నిలబడే విధంగా దీనిని నిర్మించారు. అంతే కాకుండా 51 కిమీ దూరంలో ఐదు ఓవర్ బ్రిడ్జిలు, ఆరు అండర్ బ్రిడ్జిలను నిర్మించారు.మిజోరంలో వర్షాపాతం ఎక్కువ ఏడాదిలో 5 లేక 6 నెలలు మాత్రమే బ్రిడ్జి నిర్మాణానికి వాతావరణం అనుకూలిస్తుంది. అందుకే ఈ నిర్మాణం పూర్తి కావడానికి 11 ఏళ్లుపట్టింది.
ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం
ఈ రైల్వే లైనును నిర్మించడాని ప్రత్యేకమైన రోడ్డును వేయాల్సి వచ్చింది. 200 కిమీ గల ప్రత్యేకమైన రోడ్డు మార్గాన్ని నిర్మించారు. రైల్వే లైను నిర్మాణానికి కావాల్సిన యంత్రాలు,సిబ్బంది,కార్మికులను చేరవేయడానికి ప్రత్యేకంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది.
…………………………………………..
