* మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు
* హోం మంత్రివా.. యాంకర్ వా అంటూ అనితపై ఆగ్రహం
ఆకేరు న్యూస్, అమరావతి : పవన్‌కు ఓట్లు వేసినందుకు జనం సిగ్గుపడుతున్నారని మాజీ మంత్రి రోజా (ROJA) విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(PAVAN KALYAN)పై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ధనంతో విమానాల్లో తిరగడం కాదని, ప్యాకేజీలు తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల అంశంలో మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని తెలిపారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్‌పరం చేస్తున్నారు రోజా ధ్వజమెత్తారు. మంత్రులతో జగన్‌ను ఎందుకు తిట్టిస్తున్నారు అని మండిపడ్డారు. ‘టీడీపీ ఫేక్ వీడియోలను అనిత ప్రెజెంట్ చేశారు. మహిళలపై అత్యాచారాలు, దాడులపై అనిత స్పందించడంలేదు. జగన్‌ను తిట్టడానికే అనిత (ANITHA) పరిమితమవుతున్నారు. చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని..అనిత ప్రెజెంటేషన్‌తో స్పష్టమైంది’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.‘నువ్వు హోం మంత్రి(HOME MINISTER)వా యాంకర్ (ANCHOR) వా ?మెడికల్ కాలేజీలో ఎలా ఉన్నాయో చర్చకు నాతో వస్తావా?. మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో విద్యార్థులకు ఎలా ఉంటాయో తెలుసా? మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం దిగజారి మాట్లాడుతున్నారు? అని మాజీమంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.
…………………………………
