* రాజగోపాల్‌రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు
* పీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దళిత నేతతో గొడవ విషయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డికి క్రమ శిక్షణ కమిటీ నోటీసు ఇచ్చి వారం రోజుల్లో వివారణ ఇవ్వాలని ఆదేశించినట్లు పీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. గాంధీభవన్‌లో ఆదివారం మల్లు రవి నేతృత్వంలో జరిగిన పీసీసీ క్రమ శిక్షణ కమిటీ భేటీలో నేతల మధ్య విభేదాలు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మాకు ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో ఈ విషయంలో చర్చ జరగలేదన్నారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ప్టార్టీ ఎమ్మెల్యేలందరూ సమన్వయం పాటించాలన్నారు. ఇబ్బందులేమైనా ఉంటే మాకు, పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ పార్టీలో చేర్చుకున్నదని కేసీఆర్, కేటీఆర్ లేనని, ఇప్పడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయనికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందన్నారు.
……………………………….
