* తూముకుంట నర్సారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పీసీసీ క్రమ శిక్షణ కమిటీ తనకు నోటీసు ఎందుకిచ్చారో అర్ధంకావడం లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. పీసీసీ క్రమ శిక్షణ కమిటీ అందించిన నోటీసుపై ఆయన స్పందించి, గాంధీ భవన్లో ఆదివారం నర్సారెడ్డి క్రమ శిక్షణ కమిటీతో సమావేశమై వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఫిర్యాదుపై తనకు నోటీసు ఎందుకిచ్చారో అర్ధంకావడం లేదన్నారు. తాను దళితుల సహకారంతోనే రాజకీయంగా ఎదిగానని, దళితులకే ఎక్కువ పదవులు ఇచ్చినట్లు చెప్పారు.
………………………………………
