* క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు
* వరంగల్ రచ్చపై సీఎందే తుది నిర్ణయం : మల్లు రవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తనకు మంత్రి పదవి రాకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Mla Rajgopal Reddy) కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కాంగ్రెస్పార్టీ తీరుపైనా, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. రాజగోపాల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం కూడా రేపాయి. అయితే.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదు వస్తే ఈ అంశంపై చర్చిస్తానని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆదివారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ హరికృష్ణకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ విషయంపై నర్సారెడ్డిని వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులపై వివరణ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పూజల హరికృష్ణపై ఫిర్యాదు వస్తే వివరణ అడిగామని చెప్పుకొచ్చారు. వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై కూడా నివేదిక ఇచ్చామని చెప్పారు. వారిపై చర్యలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
……………………………………….
