* తరగతి గదిలోనే మత్తుపదార్థాల తయారీ
* స్కూల్ సీజ్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఓ స్కూల్ లో డ్రగ్స్ తయారు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆరు తరగతి గదులున్న ఆ పాఠశాలలో 5 గదుల్లో పాఠాలు.. మరో గదిలో మత్తు పదార్థాలు బయట పడడం సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణం ఆ పాఠశాల అనుమతులను రద్దు చేసింది. డైరెక్టర్, ప్రిన్సిపాల్, కొరియర్ బాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మేధా పాఠశాలలో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఉన్న శ్రీమేధ స్కూల్లో కల్తీకల్లు కోసం వేరే జిల్లాలకు ఆల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్ మొదటి అంతస్తులో 5గదుల్లో తరగతులు, ఆరో గదిలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. 8 రియాక్టర్లు, రూ.20 లక్షల నగదు సీజ్ చేసిన ఈగల్ టీమ్.. వాటిని తమ కార్యాలయానికి తరలించింది. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్ మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో ప్రధాన సూత్రధారి జయప్రకాష్ ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్‌ని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు.. అతడితో స్కూల్ ప్రిన్సిపాల్, కొరియర్ బాయ్ మురళీ, శ్రీసాయి ట్రావెల్స్‌కి చెందిన ఉదయసాయిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
………………………………………………..
