* ప్రైవేట్ కళాశాలల బంద్ నేపథ్యంలో ఓ నిర్ణయం?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నగదు చెల్లించకపోవడంతో ఆ కళాశాలల యాజమాన్యం సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
……………………………………
