
* లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ
* అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, రాయపర్తి : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి గారు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని, పేదల పెళ్లిళ్లలో ఈ పథకాలు భరోసా కలిగిస్తున్నాయని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక అండగా నిలుస్తోందని, ఈ సాయంతో ఎన్నో కుటుంబాలు తిరిగి నిలబడ్డాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్దిదారులకు రూ. 72,08,352 విలువైన కల్యాణలక్ష్మ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం, 34 మంది అనారోగ్యంతో బాధపడుతున్న లబ్దిదారులకు రూ. 14,03,500 సీఎం సహాయనిధి చెక్కులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్దిధారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………