
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్ , తాడ్వాయి మండలం వెంగళాపూర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీ ఎస్ పంపిణీ చేశారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వరదల వల్ల ఇళ్లు కొట్టుకుపోయిన వారికి ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చాము ముందు 18 ఇందిరమ్మ మంజూరు చేయగా మళ్ళీ ఇప్పుడు 21 మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారు తొంగరగా పూర్తి చేసుకోవాలని,ఇళ్లు కట్టడానికి ఉచితంగా ఇసుక తీసుకునే విధంగా డిఎఫ్ఓ తో మాట్లాడుతమన్నారు.
మహిళలు అందరూ మహిళ సంఘాల్లో చేరాలని వడ్డీ లేని రుణాలు పోదాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి ఇబ్బందిగా ఉన్న వారికి వడ్డీ లేకుండా లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా ఇప్పిస్తానని అందరూ సద్వినియోగం చేసుకుని ఇళ్లను పూర్తి చేసుకోవాలని చెప్పారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా నాయకులు, కార్యకర్తలు అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………