ఆకేరు న్యూస్, కమలాపూర్:హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో మంగళవారం యూరియా కోసం లైన్లో బీరు సీసాలు, చెట్ల కొమ్మలతో క్యూ లైన్ కనిపించింది. యూరియా కోసం రైతులు చేతికి దొరికిన ప్రతి వస్తువును లైన్ లో ఉంచారు.రైతులు మంగళవారం వేకువ జామున నుంచి యూరియా కోసం, గ్రామంలోని రైతు వేదిక వద్ద క్యూలో నిలుచున్నారు. లైన్ లో చెప్పుల జతలు, బీరు సీసాలు, మందు బాటిళ్లు, సీసాలు, చెట్ల కొమ్మలు , సిమెంటు రాళ్లు ఉంచారు. ఒక లారీ లోడ్ మాత్రమే రావడంతో 220 మందికి టోకెన్లు జారీ చేశారు. మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.కాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి తప్పిదమో తమకు తెలియదు కాని యూరియా కష్టాలు మాత్రం రైతులకు ఇప్పట్లో తీరేలా లేవని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
………………………………………
