– సాగునీరు,త్రాగునీటి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి
– తాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, హుజూరాబాద్ : మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 94వ జయంతిని హుజురాబాద్ లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద గల రాజేశ్వర్ రావు విగ్రహానికి హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రాంత బిడ్డగా సింగాపురం నుండి డిల్లీ దాకా ఎదిగిన రైతు బిడ్డ అని,రాజ్యసభ సభ్యుడిగా హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా త్రాగునీరు, సాగు నీటికి, విద్య పట్ల ఆయన చేసిన సేవలు మరవలేని అని ప్రణవ్ కొనియాడారు. తన తాత ఆశయాలను కొనసాగిస్తానని అన్నారు.విద్య ఉద్యోగ కల్పనలో హుజూరాబాద్ నియోజక వర్గాన్ని మొదటి స్థానంలో ఉంచేలా పాటుపడతామని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు,అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
………………………………………….
