* పులుసం పురుషోత్తంకు 5 లక్షల చెక్కు అందజేత
* బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, బడే నాగాజ్యోతి
ఆకేర్ న్యూస్, ములుగు: ఏజెన్సీ ప్రాంతంలోని ములుగు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గం ఇన్చార్జి బడే నాగాజ్యోతి కార్యకర్తలకు ధైర్యం నింపారు మంగళవారం తాడువాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మొదట ఇటీవల అనారోగ్యానికి గురై డిశ్చార్జి అయిన పులుసు పురుషోత్తంకు బిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అందించిన ఐదు లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడు దండుగల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ సత్తా సాటాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాడాలని కోరారు ప్రజాబలం మనకు అండగా ఉన్నదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మన అధినేతలు కేసిఆర్, కేటీఆర్ ల పై ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు నిత్యం ప్రజా సేవలో ఉండాలని ధైర్యంగా ముందుకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేడారం లో పూర్వీకులు ఏర్పాటుచేసిన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని అన్నారు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రస్తుతం తరుణం లో ప్రతి ఒక్కరు కష్టపడాలని ఏకాభిప్రాయంతో ముందుకెళ్దామని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట ములుగు తాడువాయి ఏటూరు నాగారం మంగపేట మండలాల టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తోపాటు గోవింద నాయక్ స్థానిక నాయకులు దిడ్డి మోహన్ రావు, దుర్గం రమణయ్య, రామ సహాయం శ్రీనివాసరెడ్డి, ఇందిరా రెడ్డి, పోగు నగేష్ వసంతరావు, పిన్ని యాదిరెడ్డి, రజనీకర్ రెడ్డి, జాజా చంద్రం పత్తి గోపాల్ రెడ్డి, సోమనాగమ్మ, బందెల తిరుపతి, నూశెట్టి రమేష్, దానక నరసింగరావు, పులి నరసయ్య, దిలావర్ ఖాన్, తోపాటు కాటాపూర్ బీరెల్లి మేడారం తాడ్వాయి నార్లాపూర్ తదితర గ్రామాల టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………
