* తగ్గిన మదర్ డెయిరీ పాల ధర
* లీటరుపై రూ. 2 తగ్గింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మదర్ డెయిరీ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటరుపై రూ.2 తగ్గిస్తున్నామని వెల్లడించింది. అయితే తగ్గిన ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడమే. ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ (GST) టవస్తువులు మరియు సేవా పన్ను) తగ్గించడం వల్ల కలిగే ప్రత్యక్ష ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మదర్ డెయిరీ తన మొత్తం పోర్ట్ఫోలియో ఇప్పుడు అత్యల్ప స్లాబ్ కిందకు వస్తుందని తెలిపింది. వినియోగదారుల కేంద్రీకృత సంస్థగా తాము 100% పన్ను ప్రయోజనాన్ని అందజేస్తున్నామని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బాండ్లిష్ వెల్లడించారు. పనీర్, వెన్న, చీజ్, నెయ్యి, మిల్క్ షేక్స్, ఐస్ క్రీం వంటి రోజువారీ వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఉదాహరణకు 500 గ్రాముల వెన్న ప్యాక్ ధర ఇప్పుడు రూ.305కి బదులుగా రూ.285కి చేరుకోనుంది. బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీం ధర రూ.35 నుంచి రూ.30కి తగ్గింది.
…………………………………….
