ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ వెంకటాపూర్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ అమలుతీరు, మధ్యాహ్న భోజన పంపిణీ వివరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు స్థితిగతులు, టీచర్ డైరీలు, బేస్లైన్ మరియు ఫార్మాటివ్ అసెస్మెంట్ ఫలితాలు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పదవ తరగతి గది లోకి వెళ్లి విద్యార్థుల గణిత సామర్ధ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించి అందరూ విద్యార్థులు ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంచాలని, ప్రయోగ పూర్వక తరగతులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ శ్రీ గుల్లపెల్లి సాంబయ్య గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాధిక గారు, ఉపాధ్యాయులు బాబురావు, అంబేద్కర్, సంధ్యారాణి, కిషోర్ బాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………
