* కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నం
*మహబూబ్ నగర్ జిల్లా బస్వాయిపల్లిలో ఘటన
ఆకేరు న్యూస్ మహబూబ్ నగర్ :తన తాత పేరిట ఉన్న భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ భార్య, పిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఆటో నడుపుకుంటున్న శంకర్ తనతాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీవో కార్యాలయానికి ఆన్లైన్లో దస్త్రం వెళ్లగా.. ఆఫ్లైన్లో తమకుఅందలేదని రెవెన్యూ సిబ్బంది 15 వేల లంచం డిమాండ్ చేశారు. 15 వేలు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో మనస్తాపానికి గురై.. శంకర్ తన ఆటోపై పెట్రోలు పోసి.. తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో పాటు తనపై పెట్రోలు పోసుకునేందుకు యత్నిస్తుండగా ఆటోకు నిప్పంటుకోని శంకర్ చేతులు కాలిపోయాయి. వెంటనే స్థానికులు శంకర్ ని ఆస్పత్రి కి తరలించారు.
……………………………………..
