
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క పోలీసుల గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నిజాం పాలనలో ఉండడంతో భారత దేశమంతా ఏక కాలంలో విముక్తి కాలేకపోయింది
ఆ నాటి కమ్యూనిస్టు పార్టీలు,కాంగ్రెస్ పార్టీలు స్థానిక నాయకులతో కలిసి పోరాటం చేసిన తర్వాత నెహ్రూ గారు ప్రధాన మంత్రిగా,సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ గారు ఉప ప్రధాన మంత్రిగా,కేంద్ర హోం మంత్రి గా నిర్ణయాలు తీసుకుని భారత దేశానికి ఎలాగైతే విముక్తి జరిగిందో అట్లాగే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి కూడా భారత దేశంలో విలీనం చేయాలి అందరూ కలిసి స్వతంత్ర దేశంగా ఉండాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భారత దేశంలో కలపడం జరిగింది. ఆనాటి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పోరాటంలో స్వతంత్ర పోరాటంలో చేసినటువంటి పార్టీలు కుల మతాలకు వ్యతిరేకంగా తెలంగాణ విలీనానికి సహకరించారు. ఆనాటి విలీన ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని వివరించారు ఈపోరాటాన్ని కులాలను,మతాలను అంటగట్టి విభజన రేఖలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.అలాంటిని మానుకోవాలని సూచించారు. ప్రజా పాలన ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో నెహ్రూ పాలనలో ఈనాడు కూడా రేవంత్ రెడ్డి అధ్యర్యంలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని అన్నారు.మరొక సారి తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ జిల్లా నాయకులు సీనియర్ నాయకులు యూత్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మహిళ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….