
* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేపాల్ తరహాలో యువత రాష్ట్ర ప్రభుత్వం తిరగబడడం ఖాయమని ,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలీపోవడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.గన్‌పార్కు వద్ద నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి అమరవీరుల స్థూపానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు.
……………………………………………….