
* ఉదారత చాటుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన ఉదారత చాటుకొని ఆదర్శంగా నిలిచాడు. నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి చలించిన ఎమ్మెల్యే తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ ను క్యాన్సిల్ చేసి ఆ ఖర్చుతో రైతులకు ఉచితంగా యూరియా పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలో రిసెప్షన్ కు అయ్యే ఖర్చు 2 కోట్లను సీఎంకు అందజేశారు. గురువారం ఆయన కుటుంబసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు. ఆ డబ్బుతో ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా చొప్పున ఉచితంగా అందజేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యేను, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు.
………………………………………….