
* అంజనా సిన్హా ఫిర్యాదుపై కేసు నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఆయన తీసిన దహనం వెబ్ సిరీస్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా రాయదుర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై తీసిన రామ్గోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్ దహనంలో తన పేరును ప్రస్తావించారని, కొన్ని సన్నివేశాలను తాను చెప్పిన విధంగా తీశామని చెప్పుకొచ్చాడని అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………