
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సిట్ విచారణలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రభుత్వం ఇప్పుడు సీబీఐకి బదిలీ చేయనున్నట్లు సమాచారం. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రతిపక్షనాయకుడు రేవంత్ రెడ్డి ఫోన్ తో పాటు ప్రతిపక్ష నాయకుల పోన్లను, బీఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను ప్రముఖ వ్యాపారుల పోన్లను, సినిమా తారల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యడహారంపై సిట్ విచారణకు ఆదేశించింది.ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఆ క్రమంలో పలువురిని సైతం విచారించారు.అయితే ఈ వ్యవహారంలో పోలీస్ అధికారుల ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు రావడంతో సిట్ విచారణ స్థానంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించారు.
……………………………………………………..