ఆకేరు న్యూస్, కమలాపూర్: మండల వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల నిర్మాణ పురోగతిపై శనివారం కమలాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరికిషన్ పాల్గొని మాట్లాడారు.అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన పూర్తి చేయాలని, లబ్ధిదారులు నిర్మించుకునే నిర్మాణ దశలను యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లో ప్రతి సోమవారము ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని అన్నారు.కమలాపూర్, గూడూరు,మర్రిపల్లిగూడెం లోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారము స్థలములేని నిరుపేదలకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అధికారులందరూ సహకరించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మండలంలో ఉన్నతమైన ప్రగతిలో ఉంచాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుండె బాబు, హౌసింగ్ డిఇ రవీందర్, హౌసింగ్ ఏఈ హరిహరన్, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
…………………………………..
