* మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
*నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శన
ఆకేరు న్యూస్ సిద్దిపేట: తన కల సాకారం అయిందని మాజీ మంత్రి సిద్దపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ కార్మాగారంతో రైతుల జీవితాల్లో మేలు జరుగుతందని అన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉండేదని కేసీఆర్ చొరవ వల్ల ఇప్పుడు నీరు పుష్కలంగా లభిస్తోందన్నారు.కళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.అశ్వరావుపేట, సత్తుపల్లి సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి గాలిలో తేమశాతం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేది. ఖమ్మం జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఆశ్చర్యపోయాను. అక్కడ ఉండే రైతులు సంపూర్ణమైన రైతులుగా ఉన్నారు. పామాయిల్ కు పుట్టినిల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పెట్టామని హరీష్ అన్నారు.చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు 60,000 ఐటీ ఉద్యోగం వదిలి పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు అని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
……………………………………..
