
* మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
ఆకేరున్యూస్ హనుమకొండ : చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాoగ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. నిజాం నియంత్రత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత, ఓరుగల్లు పోరుబిడ్డ అని అన్నారు . దున్నేవాడికి భూమి దక్కాలని, పండించే వాడికే పంట దక్కాలని పోరాడిన ఉద్యమ వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు.
………………………………………………