
* తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
ఆకేరు న్యూస్,ములుగు: పత్తి పంట పై 11 శాతం సుంకం రద్దును వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు మండల ఉపాధ్యక్షుడు నారాయణ సింగ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రా రైతు సంఘం. ముఖ్య కార్యకర్తల సమావేశం. గుంజ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం. ములుగు మండల ఉపాధ్యక్షులు. బానోతు నారాయణ సింగ్. ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం భారతదేశం లోని పత్తి రైతులను నిండా ముంచడం కోసం పత్తి పంటపై ఉన్నటువంటి 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం సహించరానిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా తో పాటు మిత్రదేశాల ఒప్పందాలకు లోబడి మన దేశంలో పత్తి రైతులను దివాలా తీసే విధంగా అప్పుల పాలు అయ్యే విధంగా సూత్రబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు.పత్తి పంటను లాభసాటి లేకుండా చేసి, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ భూములను ఇవ్వడం కొరకు ఆయా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. రైతాంగం పత్తి పంటపై దిగుమతి సుంకం రద్దును వ్యతిరేకిస్తూ సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు. గుంజే శ్రీనివాస్. నిర్పూరి రవి. జేరిపోతుల పైడయ్య. బి సాదయ్య. తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………