
ఆకేరు న్యూస్, ములుగు: భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట ఆమే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతు ఆమె భూపోరాటానికి స్ఫూర్తి
మహిళా చైతన్యానికి ప్రతీక అని అన్నారు.ఆమే ఆశయాలను యువత ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు .అనంతరం మొక్కలు నాటారు .ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్,జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గద్దల నవీన్,సర్వ సాయి, మాజీ టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నరేందర్, కందుకూరి రతన్,తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………