
New DGP Shivadhar Reddy with CM Revanth Reddy , CS Ramakrishna Rao
* అక్టోబర్ 1 వ తేదీ నుంచి డీజీపీగా బాధ్యతలు
* 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా బీ శివధర్ రెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఇంటలీజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 1 న డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి నూతన డీజీపీ శివధర్ రెడ్డిని అభినందించారు. శివధర్ రెడ్డి 1994 ఐపీయస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఇంటలీజెన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక పోస్ట్‌ల్లో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా శివధర్ రెడ్డికి పేరున్నది.
* వ్యవసాయ కుటుంబ నేపథ్యం
శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహిం పట్నం మండలం పెద్దతుండ్ల గ్రామానికి చెందినవారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం . ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాలలతో ఎల్ ఎల్ బీ చదివి కొంత కాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. అనంతరం యూపీఎస్సీ పరిక్షలకు హాజరయి ఐపీఎస్ సాధించారు.
——————————-