
Pressmeet in kesamudram
* ఒక్క సారి మిస్సయితే మరో సారి..
* ఇద్దరు చిన్నారులను చంపిన తల్లీ
* భర్త తనను పట్టించుకోవడం లేదనేనటా..
* కేసముద్రంలో దారుణం
ఆకేరు న్యూస్ , వరంగల్ : పిల్లలకు ఆపద ఎదురయితే తల్లులు ప్రాణాలొడ్డయినా పిల్లలను కాపాడుకోవడం జంతువుల్లోనై చూస్తాం.. కుక్కలు, పందులు , కోళ్ళు, పక్షులు సైతం శత్రువు ఎంత బలవంతుడైనా తన పిల్లలను రక్షించేందుకు తుది శ్వాస వరకు పోరాడుతుంటాయి. ఆధునిక సమాజంలో మాత్రం మనుషులు ఈ లక్షణాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనో, తన ఆనందాలకు జల్సాలకు ఆటంక మవుతున్నారనో భావించి కన్న పిల్లలనే కడతేర్చుతున్న తల్లుల ను చూస్తున్నాం. మాతృ మూర్తి అన్న పదానికి అర్థం లేకుండా ఏదో జంతువు తన పిల్లలను తానే తింటున్నట్టు పసికందులను సైతం కక్ష గట్టి చంపేస్తున్నారు. రెండేళ్ళు కూడా నిండని పసి ప్రాణాలను ఒక్కసారి మిస్సయితే మరోసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకునీ మరీ ఊపిరి తీసింది ఆ తల్లీ … ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురం గ్రామం లో జరిగింది..దారుణ కాండ గురించి తెలుసుకున్న గ్రామస్తులూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.. కన్న కొడుకులను చంపడానికి చేతులెట్లా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* ఒక్క సారి ప్రాణం పోలేదని..
పందుల శిరీష ఉపేందర్ కు ముగ్గురు కొడుకులు . బందువుల కథనం ప్రకారం అతి దారుణంగా కక్ష గట్టి మరీ పిల్లలను చంపినట్లు అర్థమవుతోంది.. బంధువులు చెప్పిన వివరాల ప్రకారం 18 నెలల కుమారుడిని గత జనవరి నెలలో ఇంటి దగ్గరి సంపులో పడేసి బయటకు వెళ్లి పోయింది. నానమ్మ చూడడంతో ప్రాణాపాయం తప్పింది. మరోసారి అదే నెల జనవరి నెల 15 తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి సంపులో పడ వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు చనిపోయాడని భావించామని బంధువులు చెబుతున్నారు. ఇక జులై 31 న పెద్ద కుమారుడు మనీష్ కుమార్ ను కత్తితో మెడ కోసినట్లు కనిపించడంతో సకాలంలో ఆస్పత్రికి వెళ్ళడంతో ప్రాణాలు దక్కాయి. ఇదే మనీష్ కుమార్ ను సెప్టెంబర్ 24 వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలోనైలాన్ తాడుతో ఉరి బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో శిరీష అంగీకరించింది.
భర్త అక్రమ సంబంధం వల్లనే .. సీఐ సర్వయ్య
భర్త ఉపేందర్ మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకుని తనను పట్టించుకోవడం లేదని బాధపడుతుండేది. తన పిల్లలను సైతం తన దగ్గరకు రాకుండా తన అత్త దగ్గరే ఉంచేవాడని శిరీష మానసికంగా ఇబ్బంది పడుతుండేది.. తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించి తన కుమారులను ముందుగా చంపేయాలని భావించినట్లు పోలీసులు విచారణలో తెలిపిందని మహబూబాబాద్ సీఐ సర్వయ్య మీడియాకు వెల్లడించారు.. ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయ స్థానంలో హాజరుపరిచామని చెప్పారు.. ఈ విలేకరుల సమావేశంలో కేసముద్రం ఎస్ ఐ జీ మురళీధర్ రాజ్ ఇతర కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు
————————