* ప్రభుత్వ విభాగాల సమన్వయంలో సర్కారు వైఫల్యం
* క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రధానంగా అంబర్‌పేట(Amberpeta), మూసీ పరివాహక ప్రాంతాల చుట్టూ వరదే. ప్రజలు తీవ్రమైని ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ముంపు ముప్పునకు రేవంత్ (Revanth) సర్కారు నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఇది దుర్మార్గం అన్నారు. అంతేకాదు.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. వరద అంచనా వేయడంలో, ప్రణాళికలు వేయడంలో, ప్రభుత్వ విభాగాల సమన్వయంలో కాంగ్రెస్ (Congress) సర్కార్ వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి అని హరీశ్‌రావు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించాలని హరీశ్‌రావు (HarishRao) కోరారు.
………………………………………………..
