*వరంగల్ నగరంలో 3 ATC కేంద్రాలు రూ.22 కోట్లతో ఏర్పాటు
*ITI కళాశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
*ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్ వరంగల్ : సాంకేతికత పరమైన వృత్తి నైపుణ్యం జీవన ప్రమాణాలకు చాలా కీలకం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి విద్యా నైపుణ్యత అభివృద్ధి అవసరమమని రాష్ట్ర వ్యాప్తంగా 65 ATC సెంటర్ లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.ఈ మేరకు వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC)లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య,శాసన మండలి సభ్యుడు శ్రీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఏటీసీ సెంటర్ లు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,డిజిటల్ విద్యను అందించేందుకు దోహదపడుతుందన్నారు. ATC కేంద్రాల ఏర్పాటు ద్వారా మన యువతకు అత్యాధునిక శిక్షణ అందడం తో పాటు, వారి కెరీర్‌కు దిశానిర్దేశం జరగనుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టాటా గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ స్కిల్ డెవలప్మెంట్ యజ్ఞంలో భాగంగా, హన్మకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న మూడు కేంద్రాల్లో విద్యార్థులకు ఇండస్ట్రీకి అనుగుణమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.. ముఖ్యంగా ఎలక్ట్రికల్,మెకానికల్, ఆటోమొబైల్, వెల్డింగ్, CNC, రోబోటిక్స్, డిజిటల్ స్కిల్స్ లాంటి విభాగాలలో ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ ఇస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
టాటా గ్రూప్స్ ప్రభుత్వ ITI కళాశాలలతో చేతులు కలిపి, యువతకు నైపుణ్యాలు అందించేందుకు ముందుకు రావడం ద్వారా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ప్రారంభమైందన్నారు ఇదే కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం విశేషం.మన పిల్లలు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇక్కడే ఉన్నతమైన శిక్షణతో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే స్థితికి రావడం ఎంతో సంతృప్తికరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు,
సుదీర్ఘ చరిత్ర కలిగిన ములుగు రోడ్డు ITI కళాశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేగా తప్పకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయ సురేందర్,సయ్యద్ విజయశ్రీ రాజాలీ,డివిజన్ అధ్యక్షులు సంగీత్ నాయకులు కమల్,శివ కుమార్,రోహిత్ సింగ్,సదానందం,సమద్,క్రాంతి,మహేష్ ,పవన్,అశోక్,రాజు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………….
