
* నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ
ఆకేరు న్యూస్ హనుమకొండ: నేటి నుంచి అక్టోబర్ 18 వ తేదీ వరకు కొత్తగా ఏర్పాటు చేసే మధ్యం రిటేల్ షాపులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారలు తెలిపారు. ఈ మేరకు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు.జిల్లాలో కొత్తగా మొత్తం 67 మధ్యం దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అందులో 15 గౌడ సామాజిక వర్గానికి 10 ఎస్సీ సామాజిక వర్గానికి 1 ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించనున్నారు.అక్టోబర్ 18 సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.హనుమకొండ కలెక్టరేట్ లోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అక్టోబర్ 23న లాటరీ పద్దతుల ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో కేటాయింపు జరుగుతుందన్నారు.దరఖాస్తు దారుడు 30 వేల రూపాయల రుసుమును జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అర్బన్ పేరున డీడీ తీయాలని సూచించారు. దరఖాస్తుతో పాటు 3 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఆధార్ కార్డు,పాన్ కార్డు కాపీలు జతచేయాలని సూచించారు.రిజర్వేషన్ కేటగిరి దరఖాస్తు దారులు కులదృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలని కోరారు. దరఖాస్తు దారుడి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు.
………………………………………………………..