
*మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ
ఆకేరున్యూస్ డెస్క్ : మహారాష్ట్ర గడ్చిరోలిలో ఆరుగురు సీనియర్ మావోయిస్టు నాయకులు పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.62 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్ల మీడియాతో మాట్లాడుతూ సిద్దాంతాన్ని పక్కన పెట్టీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతుండటంతో విరక్తి చెంది అనేక మంది మావోయిస్టు ఉద్యమం నుండి బయటకు వస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు మహారాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త ఆపరేషన్ తో ఉద్యమాన్ని కొనసాగించలేక పలువురు మావోయిస్టులు లొంగుబాటువైపు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో దాదాపు 40 మంది జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ శుక్లా తెలిపారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం భీమన్న అలియాస్ వెంకటేష్ అతని భార్య విమలక్క అలియాస్ సద్మేక్ లతో పాటు మరో నలుగురు ఏసీఎంలు ఉన్నట్లు తెలిపారు.
…………………………………………………………