
* ఇంకెన్నాళ్లు విదేశాల గురించి మాట్లాడుకుందాం
* ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ :పదేళ్ల సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఇంకెన్నాళ్లు విదేశాల గురించి మాట్లాడుకుంటాం? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీకి
కి శంకుస్థాపన చేశారు. అలాగే రావిర్యాల నుంచి అమన్ గల్ వరకు నిర్మించనున్న
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఫ్యూచర్ సిటీ పైకావాలనే రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇక్కడ భూములున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణమని ఉద్ఘాటించారు.గతం నుంచి భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓ మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. పదేళ్లు టైం ఇస్తే న్యూయార్క్ దుబాయ్ లను తలదన్నే సిటీని నిర్మించి ఇస్తామని అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టెవిటీ కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్నిఒప్పించామని తెలిపారు. ముందుతరాల కోసం చంద్రబాబు, వైఎస్సార్ ఆలోచించారని నొక్కిచెప్పారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ORR వచ్చాయని గుర్తుచేశారు. గతం నుంచి భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓ మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు.
……………………………………………..