* వరద ఉధృతి బ్రిడ్జిని తాకే చాన్స్
ఆకేరు న్యూస్,నిర్మల్ : నిర్మల్ బాసరలో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. నీటిమట్టం క్షణక్షణం పెరుగుతోంది. ఇంకాస్త పెరిగితే బ్రిడ్జిని వరద ప్రవాహం తాకుతుంది. మరో మూడు ఫీట్లు పెరిగితే ముంపు ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతికి ఇప్పటికే పుష్కరఘాట్లు, నిత్యహారతి శివలింగాలు నీట మునిగాయి. బాసర (Basara) అమ్మవారి పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి పూర్తిగా నీట మునిగింది. సమీపంలోని లాడ్జిలు, హోటళ్లలోకి కూడ నీరు చేరింది. దీంతో యజమానులు యాత్రికులను ఖాళీ చేయించారు. వరద ఉధృతి రీత్యా పుష్కరఘాట్ల వద్దకు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
…………………………………………..
