* 783 పోస్టులకు 782 మంది ఎంపిక
* భర్తీకాని ఒకే ఒక్క పోస్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 (Group-2) ఫలితాలు విడుదల అయ్యాయి. టీజీపీఎస్ సి చైర్మన్ కాసేపటి క్రితం ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesam) విడుదల చేశారు. 783 పోస్టులకు 782 మందిని ఎంపిక చేశారు. ఒక పోస్టును భర్తీ చేయలేదు. మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెంకటేశం పేర్కొన్నారు. ఒక పోస్టును విత్ హెల్డ్‌లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించగా.. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. తాజాగా ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు.
……………………………………….
