* అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
* అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
* నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల మోగిన స్థానిక నగారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసింది . రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాణికుముదిని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహిస్తారు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఎన్నికలకు రూ. 350 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది ప్రభుత్వం . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.3.08 కోట్లు విడుదల చేసింది. 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహించనుంది.
ప్రక్రియ ఇలా..
* 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.
* తొలి రెండు దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు.
* మూడు దశల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికలు.
* అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
* అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్ 11న కౌంటింగ్.
* అక్టోబర్ 31, నవంబర్ 4, 8న వార్డు, సర్పంచ్ ఎన్నికలు
* గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్

…………………………………………………
